అధికారం చేపట్టాక పవన్‌కల్యాణ్‌ మారిపోయారు: పేర్ని నాని

86చూసినవారు
అధికారం చేపట్టాక పవన్‌కల్యాణ్‌ మారిపోయారు: పేర్ని నాని
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ముందు కల్తీ మద్యం, మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలు అంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కల్యాణ్‌, అధికారం చేపట్టాక మారిపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం విక్రయాలతో చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, అప్పట్లో జే బ్రాండ్‌లంటూ విమర్శించి, ప్రస్తుతం అవే బ్రాండ్‌లు మద్యం దుకాణాల్లో ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్