టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సోమవారం ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. "స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా అడుగుపెట్టి, నట జీవితంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) లో చోటు సాధించిన బాలకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు" అని పోస్ట్ పెట్టారు.