ఏపీ వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్

6చూసినవారు
ఏపీ వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్
AP: జనసేన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా, పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమించారు. అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించి, వారిని ప్రోత్సహించడమే ఈ కమిటీల ముఖ్య ఉద్దేశ్యమని పవన్ తెలిపారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను పటిష్ఠం చేయడం, క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోవడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్