పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకి: మహేష్ గౌడ్

5248చూసినవారు
పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకి: మహేష్ గౌడ్
జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకి అని, ఆయన మాటలు విభజన రాజకీయాలకు మాత్రమే పనికొస్తాయని మహేష్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, "పవన్‌ కల్యాణ్.. నీ రాజకీయాలు ఏవైనా ఉంటే ఆంధ్రాలో చూసుకో, తెలంగాణ గడ్డపై నీ పప్పులు ఉడకవు" అని వ్యాఖ్యనించారు.  పవన్ ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధిని గానీ, ఇక్కడి రైతుల ఇబ్బందులను పట్టించుకోలేదని, కేవలం ఎన్నికల సమయంలో విపక్షాలకు సపోర్ట్ చేయడానికి మాత్రమే వస్తారని ఆరోపించారు.  .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్