పార్టీని వీడి వెళ్ళే వారిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

11చూసినవారు
పార్టీని వీడి వెళ్ళే వారిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
పార్టీని వీడి ఒక నాయకుడు వెళ్ళినంత మాత్రాన ఖాళీ కాదని, జనసేన కొనసాగుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సొంత పార్టీ వారిపైనే తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చేస్తున్నారో తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 14 నాటికి గ్రామ స్థాయి నుంచి కమిటీలు పూర్తి చేస్తామని, ఆగస్టు 15న జెండా పండుగ నాడు ప్రతి గ్రామంలో జెండా ఎగరవేయాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకుందామని తెలిపారు.

సంబంధిత పోస్ట్