AP: విశాఖలో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ అకాడమీకి బుధవారం మంత్రి నారా
లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై మాట్లాడారు. ఒలింపియన్ పీవీ సింధు నాయకత్వాన్ని ప్రశంసించిన
లోకేశ్, కేబినెట్‌లో అందగాడు అనే విషయంలో సింధుతో విభేదిస్తూ, పవన్ కల్యాణ్ అందంగా ఉంటారని సరదాగా వ్యాఖ్యానించారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న పీవీ సింధు అకాడమీకి అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.