వన్యప్రాణి సంరక్షణకు 'హనుమాన్' ప్రాజెక్టు ప్రారంభించిన పవన్ కళ్యాణ్

12చూసినవారు
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్ 'హనుమాన్' ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మానవ-వన్యప్రాణి సంఘర్షణను నివారించి, సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా ఆవిష్కరించారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని, ఘటన జరిగిన వెంటనే స్పందించి పరిహారం అందించడం దీని బాధ్యత అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ట్యాగ్స్ :