AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులను అందించే ప్రతిపాదనపై వారు చర్చించారు. ఈ సహాయానికి గాను పవన్ కళ్యాణ్, ఫడ్నవీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.