కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. కృష్ణమీనన్ మార్గ్‌లోని హోంమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, ఏపీలోని పలు అంశాలు, ప్రజా, పరిపాలనా ప్రాధాన్య విషయాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా, ఉప్పాడ సముద్రకోత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను సమర్పించడానికి కాకినాడ జిల్లా అధికార యంత్రాంగానికి అవకాశం కల్పించినందుకు పవన్ కల్యాణ్ అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.