AP: కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జిల్లా శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ పరిస్థితులపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, చట్టవిరుద్ధ పోస్టులను కట్టడి చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు భద్రత, న్యాయం కల్పించడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని సూచించారు.