ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రజాదరణ గణనీయంగా పెరుగుతోంది. స్థానిక ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, శుభకార్యాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరపున గళం వినిపించే నాయకులు కరువయ్యారని, గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగ గీత కాకినాడకే పరిమితమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.