పవన్ కల్యాణ్ భారీ ప్లాన్.. టార్గెట్‌ వారే?

17చూసినవారు
పవన్ కల్యాణ్ భారీ ప్లాన్.. టార్గెట్‌ వారే?
AP: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టి యువ ఓటర్లపై కేంద్రీకృతమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 2029 ఎన్నికల నాటికి లక్షలాది మంది కొత్త ఓటర్లు ఎన్నికల జాబితాలో చేరనున్న నేపథ్యంలో, వారిని ఆకట్టుకునే వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తనను ఒక కులానికి పరిమితం చేసి చూడవద్దని, అన్ని వర్గాల మద్దతుతోనే విజయం సాధించానని పవన్ పదేపదే చెబుతున్నారు. యువతకు దగ్గరయ్యే ప్రయత్నంలో అవినీతి ఆరోపణలు లేని నాయకుడిగా, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టే నేతగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, కొత్త తరాన్ని ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్