AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో కాన్వాయ్ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ స్పష్టం చేశారు. పర్యటనలో జనాల తాకిడికి మహిళ స్పృహతప్పి పడిపోయిందని తెలిపారు. తొక్కిసలాటలో మహిళ కాలికి గాయమైందన్నారు. బాధితురాలిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎడమ కాలుకు చిన్న గాయమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని కలెక్టర్ సుమిత్ తెలిపారు.