పిఠాపురం యువతకు పవన్ కళ్యాణ్ శుభవార్త

26చూసినవారు
పిఠాపురం యువతకు పవన్ కళ్యాణ్ శుభవార్త
AP: పిఠాపురం నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 6న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభం కానుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 28 ప్రముఖ కార్పొరేట్ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన, 10వ తరగతి నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ వరకు చదివిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you