ఏపీ Dy. CM పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, తన భర్త రాజకీయ ప్రస్థానంపై ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. గత ఎన్నికల్లో
జనసేన 21 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్ ఎన్నో ఓటములు, అవమానాలు, అనిశ్చితిని ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులున్నాయని, చాలామంది ఆయన్ను అవమానించి, ఎగతాళి చేశారన్నారు. పవన్ విజయం కేవలం రాజకీయ విజయం కాదని, మానవతా విజయం అని ఆమె పేర్కొన్నారు.