AP: సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఎమ్మెల్యేల అంతర్గత కార్యకలాపాలపై నిఘా పెట్టి, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, ఆడియో, వీడియో ఆధారాలతో సహా నివేదికలు సేకరిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యవహారంపై పవన్ స్వయంగా మాట్లాడటం, తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేకు గట్టి హెచ్చరిక జారీ చేయడం వంటి సంఘటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.