AP: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన మెగా సాంస్కృతిక వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. తాను యూనివర్సిటీలకు రావడానికి అర్హుడిని కాదని, అయితే ప్రేమతో ఆహ్వానించినందుకే వచ్చానని ఆయన అన్నారు. యువత ఆలోచనలు, ప్రశ్నలు లోతుగా ఉంటున్నాయని, రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. సాంప్రదాయ విద్య లేకపోయినా జ్ఞానం సాధ్యమేనని, భగత్‌సింగ్ వంటి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.