AP: విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెరుగుతున్న కాలుష్యంపై పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు నిబంధనలు పాటించాలని, 33 శాతం గ్రీన్ బెల్ట్ తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు క్యాన్సర్, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని, దీనిని అరికట్టడానికి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరారు.