AP: చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద మగ ఏనుగు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. 13 ఏనుగుల గుంపులోని ఈ ఏనుగు మామిడి తోటలోకి వచ్చిన సమయంలో బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులోని విద్యుత్ తీగ తగిలి ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. పోస్టుమార్టం అనంతరం నిబంధనల ప్రకారం ఖననం చేయాలని సూచించారు.