అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు: పవన్‌

8173చూసినవారు
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు: పవన్‌
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పేదే ఏరువాక పున్నమి అని, నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ అని ఆయన పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్‌ అన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్