తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. కూటమి ప్రభుత్వ చొరవతో కర్నాటక కూడా ఈ పనులను వేగంగా చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబుకు పయ్యావుల ఫోన్ చేసి సమాచారం అందించారు.