శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి అచ్చెన్న

24చూసినవారు
శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి అచ్చెన్న
AP: రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. సీఎం యాప్ ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామన్నారు. 15 రోజుల్లోపు అన్నదాతల అకౌంట్లకే డబ్బులు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా 2026-27 రబీ సీజన్‌కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్