తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెంలోని పెద్దరాయల చెరువుకు గండి పడింది. దీంతో కలత్తూరు, పాతపాలెంతో పాటు కలత్తూరు హరిజనవాడ గ్రామాలు నీటమునిగాయి. దాదాపు వెయ్యి ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో పశువులు మరణించాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు వెంటనే గండి పూడ్చాలని అధికారులను కోరుతున్నారు. కాగా, ఎంపీ గురుమూర్తి ఈ సమస్య పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు విడుదల చేశారు.