‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ముందుగా మార్చి 27న విడుదల చేయాలని భావించినప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల కానున్న నేపథ్యంలో, ‘పెద్ది’ విడుదల తేదీని వాయిదా వేశారు. రెండు సినిమాల మధ్య నెల రోజుల గ్యాప్ ఉండటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.