త్వరలో పెద్దిరెడ్డి అరెస్ట్!

0చూసినవారు
త్వరలో పెద్దిరెడ్డి అరెస్ట్!
AP: అటవీ భూములను ఆక్రమించిన వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కేసు నమోదైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయితో ఏర్పాటు చేసిన కమిటీ 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి నట్లు నిర్ధారించింది. దీంతో ఆయన, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, త్వరలో పాకాల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. తాజాగా మంగళంపేటలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్