
ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మంచి రాబడినిచ్చే ఇతర మార్గాలు
కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటు, చాలామంది ఆరోగ్యం, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారిస్తున్నారు. ఖర్చులను నియంత్రించడం, పొదుపును పెంచడం, సరైన పెట్టుబడులు పెట్టడం వంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs) ఇప్పటికీ చాలామందికి సురక్షితమైన పెట్టుబడి మార్గంగా కనిపిస్తున్నాయి. ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి FDs ను ఒక నమ్మకమైన సాధనంగా భావిస్తున్నారు.




