పెందుర్తి ఎంపీడీవోపై సస్పెన్షన్ వేటు

8చూసినవారు
పెందుర్తి ఎంపీడీవోపై సస్పెన్షన్ వేటు
AP: పెందుర్తి ఎంపీడీవో అప్పలరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. స్వచ్ఛ రథం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించినందుకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఇటీవల ఎస్ఆర్ పురం, వాలిమెరక గ్రామాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జరిపిన తనిఖీల్లో పనులు అసంతృప్తికరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవోఆర్డీ కామేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్