AP: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. నందిగాం మండలం దీనబంధుపురంలో గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది మంది లబ్ధిదారులకు నిలిపివేసిన పింఛన్లను కోర్టు ఆదేశాల మేరకు తొలగించిన రోజు నుంచి ఇప్పటివరకు వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని లెక్కగట్టి రూ.18 లక్షలు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 కోట్లకు పైగా పింఛన్ల పంపిణీకే ఖర్చు పెడుతున్నామన్నామని మంత్రి అన్నారు.