AP: '
ఎన్టీఆర్ భరోసా' సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 3వ తేదీన కూడా కొనసాగనుంది. సాంకేతిక కారణాలు, దూర ప్రాంతాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల తొలి రోజుల్లో పెన్షన్ తీసుకోలేకపోయిన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఈ అవకాశం కల్పిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు/సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మిగిలిపోయిన వారికి పెన్షన్ నగదును అందజేయనున్నారు.