వచ్చే 3 నెలల్లోగా వారందరికీ పింఛన్లు

97చూసినవారు
వచ్చే 3 నెలల్లోగా వారందరికీ పింఛన్లు
AP: కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో అర్హులైన 3 లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు తొలగించారని ఆరోపించారు. వచ్చే 3 నెలల్లో వారందరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు. కాగా, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. కేటగిరీల వారీగా నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలు ఇస్తోంది.

సంబంధిత పోస్ట్