50 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్లు: ఏపీ సర్కార్

38చూసినవారు
50 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్లు: ఏపీ సర్కార్
AP: కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే 84 వేల మంది పింఛన్లు పొందుతుండగా, కొత్తగా 15,521 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలను పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వకుండా నేరుగా సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్