AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పటిలాగే ఉదయం 7 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయాలని ఉద్యోగుల ఐక్య వేదిక (AP VWSE JAC) కోరింది. 'సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాం, కానీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. విధులను సరిగా నిర్వర్తిస్తూనే, మన సమస్యలకు పరిష్కారం సాధించుకుందాం. పెన్షన్ల పంపిణీలో ఒకే మాటకు కట్టుబడదాం'' అని రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రజాక్, సెక్రటరీ జనరల్ పేరిట ప్రకటనలో తెలిపారు.