AP: విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని, డెవలప్మెంట్, సంక్షేమం, సంపద సృష్టి దిశగా యంత్రాంగం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు రీల్స్‌పై సమయం వృథా చేయకుండా, వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడం నిరంతర ప్రక్రియ అని, దానిపై దృష్టి పెట్టాలని కోరారు.