AP: ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరని, ఆయన ఎప్పుడూ పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేదని విమర్శించారు. గతంలో ప్రధాని మోదీని చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శించారని, దేశ సంపదను మోదీ ఖూనీ చేస్తున్నారని, మోదీకి కుటుంబ విలువ తెలియదని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.