ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న

8666చూసినవారు
ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరదల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలపై కలెక్టర్, ఎస్పీలతో సమగ్రంగా చర్చించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ముప్పు గ్రామాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్