కాఫీ తోటల్లో మిరియాల సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం

425చూసినవారు
కాఫీ తోటల్లో మిరియాల సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం
AP: మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని అనంతగిరి సరిహద్దు ప్రాంతాల్లో కాఫీ సాగుతో పాటు అంతర పంటగా మిరియాల సాగు విస్తరిస్తోంది. శతాబి గ్రామానికి చెందిన సార లచ్చయ్య అనే రైతు తన నాలుగు ఎకరాల కాఫీ తోటలో మిరియాల సాగు చేస్తూ ఏటా రూ. 40-50 వేల నికర లాభం పొందుతున్నారు. గత మూడేళ్లుగా స్థిరమైన దిగుబడితో పాటు కిలోకు రూ. 1000 వరకు ధర లభిస్తోంది. ఐటీడీఏ సహకారం అందితే మార్కెటింగ్ మరింత మెరుగుపడుతుందని రైతులు ఆశిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్