నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పించింది. సినిమా విడుదలైన నాటి నుంచి వారం పాటు అదనపు ధరలు అమల్లో ఉండనున్నాయి.