AP: రాష్ట్రంలో కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. గత రెండేళ్లుగా జూనియర్ కాలేజీల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో 32 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచే ఈ కళాశాలలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.