పంటలకు వాడే పురుగు మందుల్లోని రసాయనాలు 'బయో మాగ్నిఫికేషన్' ద్వారా శరీరంలోకి చేరి కిడ్నీ ఫెయిల్యూర్, సంతానలేమి వంటి సమస్యలకు కారణమవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో గత పదేళ్లలో రక్త క్యాన్సర్, లింఫోమా కేసులు 30 శాతం పెరిగాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కిడ్నీ రోగుల సంఖ్య పెరగడానికి ఫాస్పేట్ ఎరువుల్లోని ఫ్లోరైడ్, కాడ్మియం అవశేషాలే కారణమని తేలింది. ఈ రసాయనాలు నాడీ వ్యవస్థ, సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతూ పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి. యువతలో సంతానలేమి సమస్యలు పెరగడానికి ఆహారంలోని 'ఎండోక్రైన్ డిస్రప్టర్స్' ప్రధాన కారణమని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.