కూతురితో కలిసి స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని రెండు పెంపుడు కుక్కలతోపాటు వీధి కుక్కలు వెంబడించాయి. దీంతో అతను ఆత్మరక్షణ కోసం అతను స్కూటీని ఆపి వాటిని రాళ్లతో కొట్టి తరిమివేయడానికి ప్రయత్నించాడు. అది గమనించిన ఆ పెంపుడు కుక్కల యజమానులు దూసుకొచ్చి బైకర్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ కుక్కలు కూడా అతడిపై దాడికి దిగాయి. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.