దేశంలో బీమా లేని వాహనాలు విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 30.48 కోట్ల వాహనాల్లో 56 శాతం బీమా లేకుండానే తిరుగుతున్నాయని, దీనివల్ల ప్రమాద బాధితులకు పరిహారం అందడం లేదని తెలిపింది. ఈ సమస్యకు పరిష్కారంగా 'నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్' పైలట్ ప్రాజెక్ట్‌ను పరిశీలించాలని, ANPR కెమెరాలను VAHAN డేటాబేస్‌తో అనుసంధానించి ఈ-చలాన్లు జారీ చేయాలని ఆదేశించింది. కొత్త కార్లకు 4 ఏళ్లు, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్లు బీమా తప్పనిసరి చేయాలని, పౌరులు బీమా వివరాలను తనిఖీ చేసే వెసులుబాటు కల్పించాలని సూచించింది.