ఢిల్లీలో ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్‌జీ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేయనుంది. ఢిల్లీ కేబినెట్ ఆమోదించిన ఈవీ పాలసీ 2026-2030 ప్రకారం, జనవరి 1, 2027 నుంచి కేవలం ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి. ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు రూ. 30,000, త్రీ-వీలర్లకు రూ. 50,000 సబ్సిడీ ఇవ్వనుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడం ఈ పాలసీ లక్ష్యం. ఈ కొత్త పాలసీ జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.