ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి

476చూసినవారు
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. కేంద్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి
AP: కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్‌ను వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా కొరత లేదని కేంద్రం చెబుతున్నా, ఏపీలో మాత్రం డిమాండ్‌కు, సప్లైకి మధ్య అంతరం ఏర్పడిందని, 70 శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని అవినాష్‌రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్