దేశంలో ప్రైవేట్ కంపెనీ ‘నయారా’ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన కంపెనీలు కూడా రేట్లు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్,
భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పట్లో రేట్లు తగ్గించే పరిస్థితిలో లేవని నేషనల్ మీడియా పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం సమయంలో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఆ రికవరీ కోసం మరో 2 నెలల పాటు పెంచిన ధరలనే కొనసాగించనున్నట్లు తెలిపింది.