ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?.. క్లారిటీ ఇదే!

2చూసినవారు
ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?.. క్లారిటీ ఇదే!
ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ట్రేడర్స్ యూనియన్ స్పష్టత ఇచ్చింది. ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అవుతాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, అన్ని పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు పొదుపుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఈ ప్రచారం వైరల్ అయింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రేడర్స్ యూనియన్ సూచించింది.

సంబంధిత పోస్ట్