ఇక యూపీఐతోనే పీఎఫ్ డబ్బు.. కేంద్రం కొత్త విధానం

5603చూసినవారు
ఇక యూపీఐతోనే పీఎఫ్ డబ్బు.. కేంద్రం కొత్త విధానం
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకువస్తున్న కొత్త EPFO 3.0 విధానం ద్వారా ఇకపై యూపీఐతోనే పీఎఫ్ డబ్బు తీసుకునే అవకాశం రానుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ సిస్టమ్ వల్ల క్లెయిమ్ ప్రాసెస్ చాలా వేగంగా పూర్తవుతుంది. యూపీఐ ద్వారా డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలోకి డబ్బు వచ్చేయడం వల్ల వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. UMANG యాప్,  ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, యూపీఐ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఎంచుకుని అవసరమైన మొత్తం ఎంటర్ చేసి, యూపీఐ పిన్‌తో వెరిఫికేషన్ పూర్తి చేస్తే సరిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్