TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది ఛార్జ్‌షీట్ దాఖలుకు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలోని ముగ్గురు ప్రముఖ నేతలతో పాటు 10 మందిని నిందితులుగా చేర్చుతూ ఈ నెలాఖరులోగా కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు తిరిగి రావడం ఆలస్యం కావడంతో విచారణలో జాప్యం జరిగింది. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన దాదాపు 600 మందికి పైగా స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. దీనిపై ఆగస్టు చివరి వారంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.