పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అత్యాచారం

20191చూసినవారు
పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అత్యాచారం
TG: హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని కేరళంకు చెందిన నసీముద్దీన్‌గా గుర్తించారు. నసీముద్దీన్‌కు దమ్మాయిగూడకు చెందిన మరో ఉద్యోగి సల్మాన్ సహకరించగా, ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నసీముద్దీన్​ను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్