ఏనుగుకు గులాబీ రంగు.. నెటిజన్ల ఆగ్రహం

6178చూసినవారు
ఏనుగుకు గులాబీ రంగు.. నెటిజన్ల ఆగ్రహం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో రష్యన్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా ఒక ఏనుగుకు గులాబీ రంగు వేసి చేసిన ఫోటోషూట్ తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాలపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ షూట్‌లో పాల్గొన్న 70 ఏళ్ల ఏనుగు 'చంచల్' గత నెలలో మరణించినప్పటికీ, దాని మరణానికి షూట్‌కు సంబంధం లేదని అధికారులు ధృవీకరించారు. హోలీలో వాడే ఆర్గానిక్ గులాల్‌ను మాత్రమే వాడి, వెంటనే కడిగేసినట్లు ఫోటోగ్రాఫర్, ఏనుగు యజమాని తెలిపారు.

సంబంధిత పోస్ట్