అమెరికాలో విమాన, హెలికాప్టర్ ఢీ... 67 మంది మృతి

4792చూసినవారు
గతేడాది జనవరి 29న అమెరికాలోని వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం, యూఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఢీకొన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 64 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు హెలికాప్టర్‌లోని ముగ్గురు సైనికులు, మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం తర్వాత అమెరికా విమానయాన రంగంలో పెను మార్పులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్